కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వయనాడ్ ప్రజలను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ప్రజాప్రతినిధిగా పోటీ చేసే ఈ ప్రయాణం నాకు కొత్త కానీ.. ప్రజల తరపున పోరాడటం మాత్రం కొత్త కాదు. మీ మద్దతుతో మన భవిష్యత్తు కోసం నా పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లటానికి ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాగా, వయనాడ్ ఎంపీ స్థానాన్ని రాహుల్ వదులుకోవటంతో ప్రియాంక ఎన్నికల బరిలో దిగారు.