AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టీటీడీ EO శ్యామలరావు భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో సమావేశమై తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై చర్చించారు. గత పాలకమండలి హయాంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. అలాగే టీటీడీ తరుపున సంప్రోక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కల్తీ నెయ్యి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక విషయాల్లో అసలు రాజీ పడొద్దని స్పష్టంచేశారు.