TG: పల్లెలు చాలా బాగున్నాయని ట్రైని ఐఏఎస్, ఐపీఎస్లు అన్నారు. ప్రతి ఒక్కరు డిజిటల్ రంగం వైపు నడుస్తున్నారని తెలిపారు. శిక్షణలో భాగంగా గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని కలుకుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ఫీల్డ్ విజిట్లో భాగంగా మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకుని మానోపాడు మండల కేంద్రంలోని పాఠశాలలను, అంగన్వాడి సెంటర్లను, ప్రభుత్వ కార్యాలయాలను విజిట్ చేశారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనాన్ని చేశారు.