పంజాబ్‌లోని గిద్దర్బాహా, డేరా బాబానాయక్, చబ్బివాల్ అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉపఎన్నిక జరగనుంది. మేఘాలయాలోని గాంబిగ్రి స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుండటంతో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. గాంబిగ్రిలో బెర్నార్డ్ మరాక్, పంజాబ్‌లోని డేరా బాబానానక్ నుంచి రవి కరణ్ కలాన్, గిద్దర్బాహా పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ బాదల్, చబ్బివాల్ కేవల్ సింగ్ ధిల్లాన్‌ను పోటీకి దింపినట్లు ప్రకటించింది.