చాలా మంది బజ్జీలు, పకోడీలు వంటివి కొన్నప్పుడు న్యూస్ పేపర్లలో కట్టి ఇస్తుంటారు. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పేపర్లలో బ్యాక్టీరియాలు, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండటంతో ఆహార పదార్థాలు విషంగా మారి ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఆహారపదార్థాల ప్యాకింగ్‌కు న్యూస్ పేపర్లు వాడొద్దని వ్యాపారులను FSSAI హెచ్చరించింది. ఇలా ప్యాక్ చేసిన పదార్థాలు తినొద్దని వినియోగదారులకూ సూచించింది.