TG: హైదరాబాద్లో నెల రోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందనే ముందస్తు సమాచారంతో ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. నగరంలో సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలను నిషేధించినట్లు చెప్పారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదని అన్నారు. నవంబర్ 28 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.