AP: తిరుమల లడ్డూ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్ సహా ఎవరైనా మరోసారి అనుచితంగా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ప్రకాశ్ రాజ్ ఓ నాస్తికుడని, ఆయనకు దైవభక్తి లేదని.. సోషల్ మీడియాలో అవాస్తవాలు చెప్పొద్దని సూచించారు.