TG: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఇవాళ నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. గతంలో మున్షీపై బీజేపీ నేత ప్రభాకర్ చేసిన ఆరోపణల కేేసులో ఇవాళ కేసు విచారణ జరగనుంది. ఈ మేరకు దీప్దాస్ కోర్టుకు వచ్చారు. ఆమెతో పాటు బీజేపీ నేత ప్రభాకర్ కూడా హాజరయ్యారు. కాగా, దీపాదాస్ ఓ రాజకీయ నేత నుంచి మెర్సిడెస్ కారును బహుమతిగా పొందారని ఓ టీవీ ఛానల్లో ప్రభాకర్ చేసిన ఆరోపణలతో ఆమె ఆతనిపై పరువు నష్టం దావా వేశారు.