AP: తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. సత్యకుమార్‌పై దాడి ఘటనలో వారిపై ఈ కేసు నమోదైంది. ఇందులో A1గా సురేష్, A2గా బోరుగడ్డ అనిల్‌ను చేర్చారు. మూడు రాజధానుల శిబిరం వద్ద 2023లో సత్యకుమార్‌పై దాడి జరిగింది. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.