TG: రాష్ట్రంలో కులాల సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల సర్వే దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమని.. ఇది తెలంగాణ నుంచి ప్రారంభమైందని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో ఇంటింటి సర్వే ప్రారంభమైందని.. డేటా సేకరించిన తర్వాత ఆ డేటాపై పరిశోధన నిర్వహిస్తారని పేర్కొన్నారు. సమర్థవంతమైన పరిపాలన కోసం ఆ డేటా ఉపయోగించబడుతుందన్నారు. సంబంధిత అధికారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.