TG: అన్ని దేవాలయాలను ఒకే గొడుకు కిందకు తీసుకురాబోతున్నామని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. దేవాదాయశాఖ సమగ్ర వెబ్సైట్ను తయారు చేయబోతున్నామని దర్శి బోర్డును రాష్ట్ర, జిల్లా వారీగా అందుబాటులోకి తెస్తామన్నారు. క్యూ ఆర్ కోడ్ సిస్టంతో భక్తులు తమ ఇష్టదైవం, దేవాలయాలకు సంబంధించిన చరిత్రను, స్థలపురాణాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఎక్కడి నుంచైనా వారు విరాళాలు ఆన్లైన్లో ఇచ్చేలా చేస్తామన్నారు.