AP: తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం రేగింది. శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి హెలికాప్టర్ వెళ్లింది. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా కొండపై నుంచి హెలికాప్టర్ వెళ్లటాన్ని శ్రీవారి భక్తులు తప్పుపడుతున్నారు. తరచూ తిరుమల కొండపై నుంచి విమానాలు వెళ్తున్నాయని మండిపడ్డారు.