AP: తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. లీలామహల్ సమీపంలోని 3 ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు నిన్న మెయిల్లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ‘తమిళనాడులో ఉగ్రవాది జాఫర్ సాదిక్‌కు జైలుశిక్ష పడటంలో.. ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ సహకారం అందించారు. దీంతో తమిళనాడుతో పాటు రాష్ట్రంలోనూ పేలుళ్లకు ISI పూనుకొంది’ అని మెయిల్లో పేర్కొన్నారు.