AP: మాజీ CM జగన్, షర్మిల మధ్య ఆస్తుల విభేదం తలెత్తింది. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో తల్లి విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్ వేశారు. తల్లికి ఇచ్చిన షేర్లను షర్మిల ట్రాన్స్ఫర్ చేయించుకుందని, వాటిని విత్డ్రా చేసుకోవాలనుకుంటునట్లు పిటిషన్లో పేర్కొన్నారు. కంపెనీలో తనకు, భారతికి కలిపి 51.1% షేర్లు ఉండేలా తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై నవంబర్ 8న విచారణ జరగనుంది.