AP: తనను టీటీడీ ఛైర్మన్‌గా నియమించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పదవి తన జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో ఎక్కడా దుర్గంధం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి విషయాన్ని బోర్డు మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరైనా తనపై తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకెళ్తానని హెచ్చరించారు.