AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. సాయంత్రం 5:45 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి 6.30 నుంచి 7 గంటల వరకు ఆయనతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై.. అలాగే రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.