TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. నిందితులను పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేసినట్లు ఖరగ్‌పూర్ GRP పోలీసులు తెలిపారు. వారి నుంచి వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉండగా చోరీ జరిగినట్లు వెల్లడించారు.