ఎన్నికల ఫలితాల రోజు డొనాల్డ్ ట్రంప్ గోల్‌మాల్‌కు పాల్పడకుండా అడ్డుకుంటామని కమలా హారిస్ అన్నారు. వ్యూహాల్లో భాగంగా ఫలితాలు రాక ముందే ట్రంప్ గెలిచినట్లుగా ప్రచారం చేస్తారని.. అలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తమ బృందం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా 2020 ఎన్నికల ఫలితాల సమయంలో ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.