AP: ఎమ్మెల్యే మాధవి, టీడీపీ ఇంఛార్జ్ బంగార్రాజు మధ్య గొడవ తలెత్తింది. నగర పంచాయతీ సమావేశంలో బంగార్రాజుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగార్రాజును సమావేశం నుంచి బయటకు పంపాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నిబంధనల మేరకే సమావేశంలో ఉన్నానని బంగార్రాజు స్పష్టం చేశారు. కర్రోతును బయటకు పంపకపోతే తాను వెళ్లిపోతానని ఎమ్మెల్యే తెలిపారు. బంగార్రాజు అక్కడే ఉండటంతో కౌన్సిల్ నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.