టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిలో పోలీసులు ఎక్కువగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇటీవల గాజియాబాద్- కాన్పుర్ సెక్షన్లో వివిధ రైళ్లలోని ఏసీ కోచ్లలో వందలాది మంది పోలీసులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారితో ఫైన్ కట్టించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. దీంతో అక్టోబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు రైళ్లలో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.