»%e0%b0%9f%e0%b0%be%e0%b0%b2%e0%b1%80%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d %e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b0%bf Good News
AP: రాష్ట్ర ప్రభుత్వం టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టం తీసుకొస్తున్నట్లు టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటకంగా నష్టపోయామన్నారు. ఈ ప్రభుత్వం పర్యాటకానికి పెద్దపీట వేస్తుందని.. స్వదేశీ, ప్రసాద్ స్కీమ్లను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొస్తామని వెల్లడించారు. రుషికొండ భవనాలను ఏం చేయాలి అనే దానిపై త్వరలో సమాచారం ఇస్తామని తెలిపారు.