TG: జీవో 317పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తాజాగా సీఎం రేవంత్‌ను కలిసి నివేదికను సమర్పించింది. కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్.. ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రత్యేక వెబ్సైట్, ప్రత్యక్ష వినతి పత్రాల ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయుల వినతులను కమిటీ సేకరించింది. ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం తుది నివేదికను సీఎంకు సమర్పించింది.