TG: కాంగ్రెస్ పార్టీలో చేరిన BRS ఎమ్మెల్యేలపై వేటు వేయాలని MLC జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీ నిర్ణయం మేరకే ఎమ్మెల్యేలను చేర్చుకున్నామన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనివల్ల జీవన్ రెడ్డి ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగలేదని పేర్కొన్నారు.