AP: కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రముఖ నటుడు సోనూసూద్ శుభాకాంక్షలు తెలిపారు. 100 రోజుల పాలనలో చంద్రబాబు మార్క్ కనిపించిందని కొనియాడారు. ఆయన పాలనలో ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మంచి విజన్‌తో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని.. ఇందుకు గర్వంగా ఉందన్నారు. కాగా ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా పలువురు ప్రముఖులు తమ విషెస్ తెలియజేస్తున్నారు.