కేరళలోని ఇడుక్కిలో ఇంటర్మీడియెట్ స్టూడెంట్స్ చేసిన పనికి ఎక్సైజ్ అధికారులు షాక్ తిన్నారు. త్రిసూర్‌లోని ఎయిడెడ్ పాఠశాలకు చెందిన 100 మంది స్టూడెంట్స్ మున్నార్ ట్రిప్‌కు వెళ్లారు. మధ్యలో ఇడుక్కి వద్ద గంజాయి బీడీ తాగేందుకు ఎక్సైజ్ ఆఫీస్‌కు వెళ్లిన విద్యార్థులు అధికారులనే అగ్గిపెట్టె అడిగారు. దీంతో ఎక్సైజ్ అధికారులు ఇద్దరు స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకుని వారి నుంచి 6 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.