TG: మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావా కేసు విచారణ నాంపల్లి ప్రత్యేక కోర్టులో జరిగింది. మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఇంఛార్జ్ న్యాయమూర్తి విచారణ నవంబర్ 13కు వాయిదా వేశారు. కొండా సురేఖ తరపున న్యాయవాది గురుమిత్ సింగ్ హాజరయ్యారు. ఈ విషయంపై మాజీమంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను కూడా నవంబర్ 13కు వాయిదా వేశారు.