TG: మంత్రి కొండా సురేఖపై మాజీమంత్రి కేటీఆర్ వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసింది.