TG: BRS నేత కేటీఆర్‌కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ విసిరారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో కేటీఆర్ చూపిన ఆస్తి ఎంత? 2023లో చూపిన ఆస్తులెంత? అని నిలదీశారు. పదేళ్లలో వేల కోట్ల ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014కు ముందు కేటీఆర్‌కు ఫామ్‌హౌస్‌లు లేవని.. ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నించారు. ఏ వ్యాపారం చేసి సంపాదించారో ప్రజలకు చెప్పాలన్నారు. BRS నేతలందరూ అవినీతిపరులే అని ఆరోపించారు.