TG: నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో పడవ ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఈరోజు పునఃప్రారంభించారు. తాజాగా రాష్ట్ర పర్యాటకశాఖ పడవ ప్రయాణానికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ పడవ ద్వారా 6 గంటల్లో 120 కిలోమీటర్ల ప్రయాణం చేసి చేరుకోవచ్చు. నాగార్జునకొండ, నందికొండ, సలేశ్వరం మధ్య ఈ ప్రయాణం కొనసాగనుంది. పెద్దలకు రూ.3వేలు, చిన్న పిల్లలకు రూ. 2,400గా ఛార్జీలను నిర్ణయించారు.