TG: రాష్ట్రంలో ఎట్టకేలకు ఇవాళ కులగణన ప్రక్రియ ప్రారంభమైంది. 75 ప్రశ్నలతో స్పెషల్ ఫార్మాట్‌తో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో మొత్తం 87,900 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. GHMC కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్యుమరేటర్లకు సర్వే సామగ్రిని అందజేశారు. కులగణనకు ప్రజలు సహకరించాలని, ఆధార్ కార్డు ఆప్షనల్ మాత్రమే అని మంత్రులు సూచించారు.