AP: కార్యకర్తల కృషితోనే రాష్ట్రానికి టీడీపీ సేవలందించే స్థాయికి వచ్చిందని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని CM చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం పోరాడి అనేక కేసులు పెట్టించుకున్నారని, జైలుకు వెళ్లారని, ఆస్తులు పోగొట్టుకున్నారని తెలిపారు. అలాంటి వారిని పార్టీ మర్చిపోదన్నారు. ఈ మేరకు లబ్ధిదారులైన కార్యకర్తలతో CM జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. గతంలో బీమా రాని 73 మందికి రూ.2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు.