TG: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 డిపోల అధికారులతో నగరంలోని ప్రాంతీయ మేనేజరు కార్యాలయంలో బస్సుల ఏర్పాట్లపై RM సరిరాం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. APలోని పంచరామాలు, అరుణాచలం, శబరిమల, అన్నవరం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్చించారు. పంచరామాలకు నవంబరు 3 నుంచి 10 వరకు, 14 పౌర్ణమి, 17 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం ఏడు డిపోల పరిధిలో బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.