ఉక్రెయిన్‌పైకి ఉత్తరకొరియా బలగాలు ఇంకా దండెత్తలేదని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ఆ చర్యకు నెలలు పట్టదని, కొన్ని రోజుల్లోనే అది జరగొచ్చని అన్నారు. ప్రాంతీయ భద్రత హమీదారుగా ఉన్న చైనా మౌనం అసాధారణంగా ఉందని, యుద్ధంలో ఉత్తరకొరియా అధికారిక పాత్ర కనిపిస్తోందని మండిపడ్డారు. రష్యాలోని కర్మాగారాల్లో ఉత్తరకొరియా ఆయుధాలు, కార్మికులు మాత్రమే కాదు.. కుర్క్స్లో ఏకంగా సైనికులే ఉన్నారంటూ ఆరోపించారు.