జమ్మూకశ్మీర్ బీజేపీ MLA, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ రాణా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, నగ్రోటా BJP MLA దేవేందర్ సింగ్ రాణా(59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేవేందర్ మృతిపై J&K డిప్యూటీ సీఎం సురేందర్ కుమార్, లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, BJP నేతలు సంతాపం వ్యక్తం చేశారు.