మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 23 మందితో రెండో జాబితా విడుదల చేసింది. నాగ్పూర్ సౌత్ నుంచి గిరీష్ పాండవ్, వార్ధా నుంచి శేఖర్ షిండే, యవత్మాల్ నుంచి అనిల్ మంగూల్కర్కు టికెట్లు ఇచ్చింది. అలాగే, కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాను కూడా ఇవాళ విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం 48 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే.