డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ భారీ విరాళం ప్రకటించారు. హారిస్‌కు మద్దతు ఇస్తున్న ‘ఫ్యూచర్ ఫార్వర్డ్’ ఎన్జీవో సంస్థకు రూ.420 కోట్లు బదిలీ చేసినట్లు అక్కడి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆయన తన సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లుగా కథనాలు పేర్కొన్నాయి.