మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన పేరు మీద ఫౌండేషన్ ప్రారంభించారు. చదువు, పోషకాహారం, మానవ హక్కులు వంటి అంశాలపై పని చేస్తుంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఆకలితో ఎవరూ పస్తులు ఉండకూడదనే ఆశయంతో మూడేళ్ల క్రితం కోయంబత్తూరులో ‘ఏక్ ఆశా జన్ రసోయీ’ పేరుతో మరో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఒక్క రూపాయికే తిన్నంత భోజనాన్ని అందిస్తున్నారు. అన్నం, చపాతి, కూరలు అందిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా ఈ సేవల్ని ప్రారంభించారు.