గత ప్రభుత్వం నీతి, నిబద్ధతల్లో వివక్ష భావాలు దేశ సమైక్యతను దెబ్బతీశాయని ప్రధాని మోదీ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఐక్యతా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘నేడు ప్రభుత్వం చేసే ప్రతి పనిలో దేశ సమైక్యత స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో వివక్షను తొలగించేందుకు నిర్విరామంగా పనిచేశాం. ప్రతి స్కీమ్‌లో ఐకమత్యమే ప్రాణశక్తి. దీనిని చూసి పటేల్ ఆత్మ మమ్మల్ని ఆశీర్వదిస్తుంది’ అని పేర్కొన్నారు.