ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్ 370ని తొలగించామన్నారు. స్థానిక భాషల అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని పేర్కొన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వారి కుట్రలు సాగనివ్వమన్నారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశ వికాసానికి దోహదం చేస్తుందని, ఏటా ఎన్నికల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతోందని వెల్లడించారు.