మహరాష్ట్రలోని అహేరీ అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ స్థానం నుంచి తండ్రీకూతురు ఎన్నికల బరిలో తలపడనున్నారు. NCP(అజిత్ పవార్) నుంచి ధర్మారావు బాబా ఆత్రమ్, NCP(శరద్ పవార్) నుంచి ఆయన కుమార్తె భాగ్యశ్రీ పోటీ పడుతున్నారు. స్వయంగా తన పనులు చేసుకోలేని నేత ప్రజలకు ఏం చేస్తారంటూ భాగ్యశ్రీ తండ్రిపై విమర్శలు చేశారు. తన కూతురికి వంట రాదని, అల్లుడు నిత్యం జొమాటో నుంచి భోజనం తెప్పించుకుంటాడని ధర్మారావు ఎద్దేవా చేశారు.