అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు అమెరికాలో రిగ్గింగ్ జరగకూడదని అన్నారు. కేపిటల్ బిల్డింగ్పై దాడి ఘటన పునరావృత్తం కాకూడదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫిలడెల్ఫియా నుంచి కేఏ పాల్ సందేశం పంపారు.