AP: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు భారీ స్పందన లభించింది. ఇప్పటి వరకు మొత్తం 16,82,646 సిలిండర్లు బుకింగ్ చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు 6,46,350 సిలిండర్లను డెలివరీ చేశారు. కాగా, లబ్దిదారులకు ఉచిత సిలిండర్ల నిమిత్తం రూ.38.07 కోట్లు సబ్సిడీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు రూ.16.97 కోట్ల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.