AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, GST ఛార్జీల రద్దుకు ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్లు భారమని అంచనా వేసింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు ఆమోదించింది. ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులను ఆదేశించారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలన్నారు.