తెల్లటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే తెల్లటి చక్కెర, బ్రెడ్, ఉప్పు, వెన్న, బియ్యం. చక్కెర అధికంగా తీసుకోవడం వలన శరీరంలో మంట, షుగర్ లెవెల్స్, కేలరీలు పెరుగుతాయి. ఇక బ్రెడ్లో ఫైబర్ ఉండదు కాబట్టి జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. అధికంగా పాలిష్ చేసిన బియ్యం తినడం వలన గుండె జబ్బులు వస్తాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన రక్తపోటు వచ్చే ఛాన్స్ ఉంది.