AP: రాష్ట్రంలో ‘తల్లికి వందనం’ పథకం అములపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని.. త్వరలోనే ఈ పథకం ప్రారంభం కానుందని తెలిపారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. ’తల్లికి వందనం’ ఇస్తామని ప్రకటించారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని వెల్లడించారు.