నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య విబేధాలు నెలకొన్నాయి. ఈ కేసులో దర్యాప్తు విషయాలను తాము అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్‌కు లీక్ చేసినట్లు కెనడా NSA అధికారి నటాలియా డ్రౌయిన్ అంగీకరించారు. పార్లమెంట్ ప్యానెల్ ఎదుట ఈ విషయాన్ని బయటపెట్టారు. ‘ఈ కేసుతో భారత్ అధికారులకు సంబంధం ఉందని పోలీసులు బయటకి చెప్పకముందే US మీడియా సంస్థలకు ఆ విషయాన్ని లీక్ చేశాం. ఇందుకు ప్రధాని ట్రూడో అనుమతి అవసరం లేదు’ అని తెలిపారు.