అమరావతి రైల్వే లైన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఏపీ ప్రజల కలను కేంద్రం నెరవేర్చిందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రైల్వేలైన్కు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారన్నారు. అమరావతి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి తాము సిద్ధం అన్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. ఈ లైన్ వల్ల మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అమరావతితో కనెక్షన్ ఏర్పడుతుందని అన్నారు.