AP: అమరావతి రైతులతో సీఆర్డీఏ, ప్రపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులపై రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అమరావతికి రుణాలు ఇచ్చే సమయంలోనే ఇళ్లు కట్టాలని పలువురు కోరినట్లు సీఆర్డీఏ కమిషనర్ వెల్లడించారు. దాదాపు రూ. 30వేల కోట్ల రుణం ఇచ్చే అవకాశం ఉన్నట్లు కమిషనర్ భాస్కర్ తెలిపారు.