అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బియ్యాన్ని నానబెట్టి వంట చేసుకోవడం జీర్ణ వ్యవస్థకూ మంచిది. ఇలా వండిన అన్నం.. త్వరగా అరుగుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యలూ దూరమవుతాయి. ఇలా వండిన అన్నం తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. బియ్యంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు నీటిలో కరిగిపోతాయి కాబట్టి, బియ్యాన్ని అరగంట సేపు నానబెడితే చాలని అంటున్నారు.