రష్యా పర్యటన నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తలకు గాయమైంది. బాత్రూంలో జారిపడటంతో ఆయన తలకు దెబ్బ తగిలినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షుడు లూయిజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నట్లు బ్రెజిల్ అధికారిక కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.